News April 10, 2025
సంగారెడ్డి: 15 వరకు PM ఇంటర్న్ షిప్ గడువు పెంపు: కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండవ దశ దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పెంచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలని చెప్పారు. pminternship.mca.gov.in పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5 వేలు 12 నెలలు అందిస్తారన్నారు.
Similar News
News December 7, 2025
DRDOలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా?

<
News December 7, 2025
శని దోషం ఎలా ఏర్పడుతుంది?

జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉంటే వారికి శని దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. మన కర్మల ఫలితంగా ఈ దోషం ఏర్పడుతుందని జ్యోతిషులు చెబుతున్నారు. ఈ దోషం ఉన్నవారికి జీవితంలో అనుకోని ఆలస్యాలు, కష్టాలు, సవాళ్లు, మానసిక ఆందోళనలు ఎదురవుతాయని అంటున్నారు. జన్మరాశిలో శని సంచారం ఆధారంగా ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. వీటి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 7, 2025
నగరంలో NAVY బ్యాండ్ షో.. ఫ్రీ ఎంట్రీ

ఇండియన్ నేవీ డే ఉత్సవాల్లో భాగంగా NAVY సాగర శక్తిని చాటిచెప్పే సంగీత విభావరి హైదరాబాద్లో జరగనుంది. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం) నుంచి వచ్చిన 26 మంది సభ్యుల నేవీ బ్యాండ్, డిసెంబర్ 8న సా.6 గంటలకు కొండాపూర్లోని సరత్ సిటీ మాల్లో గంట పాటు సంగీత ప్రదర్శన ఇవ్వనుంది. 1971 యుద్ధ విజయ స్ఫూర్తిని గుర్తుచేస్తారు. ఈ ఉచిత కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులే.


