News April 15, 2025
సంగారెడ్డి: 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శ్రీర్గాపూర్ మండలం కడపలో 41.1 డిగ్రీలు నమోదు కాగా.. పటాన్ చెరు మండలం పాశమైలారంలో 40.8, చౌటకూరు, జిన్నారం, కోహీర్ మండలం దిగ్వాల్ 40.7, కల్హేర్, ఖేడ్ 40.6, వట్టిపల్లి, పుల్కల్ 40.5, వట్టిపల్లి మండలం పాల్వంచ 40.4, జహీరాబాద్, కంగ్టి, హత్నూర మండలం గుండ్ల మాచనూరు 40.3 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News November 21, 2025
అండమాన్లో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
News November 21, 2025
ఖమ్మంలో ఫుట్ పాత్ల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. నగరంలో ప్రధాన రోడ్లలో ఫుట్ పాత్ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యలపై చర్చించారు. వైరా రోడ్డు, బైపాస్, ఇల్లందు రోడ్డు వంటి 8 ప్రధాన రోడ్లకు ఫుట్ పాత్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.
News November 21, 2025
సంగారెడ్డి: ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాలకు గురైతే 48 గంటల్లో 1930, https://www.cybercrime.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


