News March 12, 2025
సంగారెడ్డి: 20 మంది ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్: డీఈవో

జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 16, లాంగ్వేజ్ పండిత్ ముగ్గురు, పీఈటీ ఒకరిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యులరైజ్ పత్రాలు ఆయా టీచర్లకు అందజేస్తామని చెప్పారు. డీఈవో నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 16, 2025
రాజన్న దర్శనాల నిలిపివేత.. గుడి బయటే మొక్కులు

రాజన్న దర్శనం కోసం వచ్చిన వందలాది మంది భక్తులు గుడి ముందు బహిరంగ ప్రదేశంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసి భీమన్న ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ.. చాలామంది భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించుకోకుండా తిరిగి వెళ్ళవద్దనే భావనతో ఆలయం బయట కొబ్బరికాయలు కొట్టి దండం పెడుతున్నారు. దీంతో ఆలయ ముందు భాగంలో గేటు బయట సందడి నెలకొంది.
News November 16, 2025
ADB: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఉన్న నాగోబా ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు.
News November 16, 2025
రాజ్యాంగం వల్లే చాయ్వాలా ప్రధాని అయ్యారు: CBN

AP: బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘చాయ్వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారంటే రాజ్యాంగం వల్లే. మన రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయవ్యవస్థ కీలక బాధ్యత పోషిస్తోంది’ అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, CJI పాల్గొన్నారు.


