News March 12, 2025
సంగారెడ్డి: 20 మంది ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్: డీఈవో

జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 16, లాంగ్వేజ్ పండిత్ ముగ్గురు, పీఈటీ ఒకరిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యులరైజ్ పత్రాలు ఆయా టీచర్లకు అందజేస్తామని చెప్పారు. డీఈవో నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 21, 2025
మెదక్: 10TH విద్యార్థులకు ALL THE BEST

టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు ఉమ్మడి మెదక్ కలెక్టర్లు మను చౌదరి, వల్లూరు క్రాంతి, రాహుల్ రాజ్ ఆల్ ద బెస్ట్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోను అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్, అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
News March 21, 2025
నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంకు చెందిన ఎన్.రాము (54) రాజయ్యపేట శివారు కల్లుపాకల వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 19న పొలానికి వెళ్లిన రాము ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గురువారం కల్లుపాకల వద్ద శవమై కనిపించాడు. ఇతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నందున కుటుంబ సభ్యులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.
News March 21, 2025
అమ్రాబాద్: నల్లమల అడవిలో వన్య ప్రాణుల వివరాలు ఇలా..

ప్రపంచ అటవీ శాఖ దినోత్సవం సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో గతేడాది అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం చిరుతపులులు 176, పులులు 33, ఎలుగుబంట్లు 250, ఇతర అటవీ జంతువులు మరో 10 వేల వరకు ఉంటాయని ఫారెస్ట్ అధికారులు లభించారు. వేసవిలో వన్యప్రాణులకు తాగునీరు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.