News February 17, 2025
సంగారెడ్డి: 2008 DSCకి ఎన్నికైన మాజీ ఉప సర్పంచ్

2008 డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 184 మంది నియామకం అయ్యారు. కాగా నాగల్గిద్ద మండలం కారముంగి మాజీ ఉప సర్పంచ్ గుండెరావు పాటిల్ తాజాగా టీచర్ అయ్యారు. తమకు 2008 డీఎస్సీ ఫలితాలు వివిధ కారణాలతో ఆగిపోవడంతో వ్యవసాయం చేసుకుంటూ గ్రామానికి ఉపసర్పంచిగా సేవలందించానని పాటిల్ తెలిపారు. 17ఏళ్ల నిరీక్షణ అనంతరం ఫలితాలు అనుకూలంగా రావడంతో సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 24, 2025
ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
News November 24, 2025
MDK: స్థానిక పోరుకు సిద్ధమా..?

ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ పోరుకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు పూర్తి చేశారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేఫథ్యంలో పల్లెల్లో రాజకీయం వెడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నచోట పోటీకి సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లు అనుకూలం లేనిచోట అనుచరులను బరిలో నిలిపి స్థానికంగా పట్టు నిలుపుకోవాలని నాయకులు భావిస్తున్నారు. మెదక్లో 223 సర్పంచ్, 1,810 వార్డులను మహిళలకు కేటాయించారు.
News November 24, 2025
అన్నమయ్య: పక్కా ఇల్లు.. 6రోజులే గడువు

గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. స్థలం ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు. స్థలం లేనివాళ్లకు 3సెంట్లు కేటాయించి ఇల్లు మంజూరు చేస్తారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వాళ్లు సైతం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు చేస్తారు.


