News February 20, 2025
సంగారెడ్డి: 21న ఎమ్మెల్సీ ఎన్నికల విధులపై శిక్షణ: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో రెండో విడత ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఈ శిక్షణకు విధులు కేటాయించిన అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.
Similar News
News December 2, 2025
ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2010-11 సంవత్సరం నుంచి 2025 వరకు డిగ్రీ, పీజీ ప్రవేశం పొందిన విద్యార్థులు స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
News December 2, 2025
HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.
News December 2, 2025
భూపాలపల్లి: 3న దివ్యాంగుల దినోత్సవం

జిల్లాలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమావేశం హాల్లో ఈ వేడుక జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లిశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరారు.


