News February 20, 2025
సంగారెడ్డి: 21న ఎమ్మెల్సీ ఎన్నికల విధులపై శిక్షణ: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో రెండో విడత ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఈ శిక్షణకు విధులు కేటాయించిన అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.
Similar News
News March 21, 2025
BRS వల్ల ఒక జనరేషన్ నాశనం: భట్టి

TG: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను BRS నాశనం చేసిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లపాటు ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కుంది’ అని ఫైర్ అయ్యారు.
News March 21, 2025
అనకాపల్లి: పదవ తరగతి పరీక్షకు 132 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 132 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరుకావాల్సి ఉండగా 20,677 మంది హాజరైనట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు 40 మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం ఐదుగురు మాత్రమే హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు.
News March 21, 2025
MBNR: CMను కలిసిన VC.. పాల్గొన్న ఎమ్మెల్యేలు

కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మక్తల్ ఎమ్మెల్యే డా.వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.