News March 9, 2025

సంగారెడ్డి: 21 రోజులు.. చేయాల్సిన ఖర్చు రూ.39 కోట్లు

image

మిగిలింది 21 రోజులు.. ఖర్చు చేయాల్సింది రూ.39 కోట్లు. ఈ లెక్కలు ఏంటని అనుకుంటున్నారా.. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పనిదినాలను బట్టి జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరు అవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.60.40 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని 50 శాతం నిధులు ఖర్చు చేశారు. మార్చి 31లోపు రూ.39 కోట్లు ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కి పోనున్నాయి.

Similar News

News January 19, 2026

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీసిన సీఎం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల పున:ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆది శ్రీనివాస్‌ను వేములవాడ ఆలయ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.

News January 19, 2026

పోలీస్ PGRSకు 27 అర్జీలు: ఎస్పీ రాహుల్ మీనా

image

అమలాపురంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమానికి 27 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ, సమస్యలను చట్టపరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

News January 19, 2026

జగిత్యాల: సర్పంచ్‌ల శిక్షణా తరగతులు ప్రారంభం

image

జగిత్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల కోసం ఉద్దేశించిన శిక్షణా తరగతులు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నూకపల్లిలోని NAC సెంటర్‌లో 7 మండలాల సర్పంచ్‌లకు 5 రోజుల పాటు జరిగే ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి మదన్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పంచాయతీ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. మొదటివిడత మండలాల సర్పంచ్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.