News March 30, 2025

సంగారెడ్డి: 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్‌ల యజమానులందరూ ఈ నెల 31లోగా పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. 25% రాయితీ గడువు రేపటితో ముగుస్తుందని ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News April 3, 2025

సన్న బియ్యం పంపిణీ చేసిన నల్గొండ కలెక్టర్

image

దిండి(గుండ్లపల్లి) మండలం కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పీ మౌనిక ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, కొత్త రేషన్ కార్డుల కోసం ఈ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News April 3, 2025

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన డీఎంఅండ్‌హెచ్ఓ

image

శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై గురువారం ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేశారు. డీఎం‌అండ్‌హెచ్‌ఓ బాలమురళీకృష్ణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బీవీవీ రమణమూర్తి గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ మెడికల్ లీవ్‌‌లో ఉంది. ఆమె తిరిగి విధుల్లో చేరేందుకు లంచం అడగడంతో ఏసీబీని ఆమె ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News April 3, 2025

మహబూబ్‌నగర్‌లో SFI, BRSV నాయకుల నిరసన 

image

హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం అక్కడ విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఎస్ఎఫ్ఐ, బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు రాము మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల జోలికి వస్తే సహించేది లేదన్నారు.

error: Content is protected !!