News February 10, 2025
సంగారెడ్డి: 27 మండలాలకు రిటర్నింగ్ అధికారుల నియామకం

జిల్లాలోని 27 మండలాలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రిటర్న్ అధికారులు నియమిస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాస్థాయి అధికారులు రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అధికారులకు కేటాయించిన మండలాల్లో రిటర్న్ అధికారులుగా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.
Similar News
News March 24, 2025
కర్నూలు జిల్లాలో TODAY TOP NWS

➤ డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్
➤ కర్నూలులో టీడీపీ నేత హత్య.. నిందితుడి భార్య అరెస్ట్
➤ ఆదోని పరిధిలో 20అడుగుల అతిపెద్ద పాము
➤ కోడుమూరులో దారుణం.. విద్యార్థిని చితకబాదిన సీనియర్
➤ కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను
➤ పెద్దకడబూరు: కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
➤ కోడుమూరు ఘటన.. వార్డెన్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్
➤ క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: జేసి
News March 24, 2025
NZB: యథావిధిగా పాఠశాలలు

ఈ నెల 25న అన్ని పాఠశాలలు యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని డీఈఓ అశోక్ తెలిపారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఎగ్జామ్ సెంటర్లు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తుండగా 25న ఎస్ఎస్సీ పరీక్ష లేకపోవడంతో ఈ సవరణ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తిస్తున్న వారు యథావిధిగా తమ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు.
News March 24, 2025
తిరుపతి: విద్యార్థులు డిబార్.. టీచర్లు సస్పెండ్

తిరుపతి జిల్లా KVBపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. చిట్టాలతో ఇద్దరు విద్యార్థులు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు చిక్కారు. ఈ మేరకు ఆ ఇద్దరిని డిబార్ చేశామని డీఈవో కేవీఎన్ కుమార్ వెల్లడించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఇన్విజిలేటర్లు యాదగిరి, దివాకర్‌ను సస్పెండ్ చేశామని చెప్పారు.