News February 1, 2025
సంగారెడ్డి: ‘3 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు’

జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఈ నెల 3 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందు రాం శనివారం తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని కాలేజీ ప్రిన్సిపల్స్‌కు సూచించారు. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే కేంద్రాలలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 6, 2025
ప్రయాగ్‌రాజ్‌లో హరీశ్ రావు దంపతులు

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
News February 6, 2025
GWL: పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి.!

గ్రామీణ ప్రాంతాల పిల్లల భద్రత, పోషణ, ఆరోగ్యం, విద్యా భివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పోషణ, సాధికారిక ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ఐడిఓసి సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలను బలోపేతం చేయడం ద్వారా పిల్లల సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు.
News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ

AP: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.