News March 6, 2025

సంగారెడ్డి: 31లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో LRS క్రమబద్ధీకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

Similar News

News January 7, 2026

కంది గింజలను నిల్వచేసే సమయంలో జాగ్రత్తలు

image

కంది గింజలను గోనె సంచులలో లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, నేలపై లీటరు నీటికి మలాథియాన్ 50% ఇ.సి 20ML కలిపి పిచికారీ చేయాలి. కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేస్తే బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50mlను కిలో గింజలకు పట్టించి నిల్వచేసి పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు.

News January 7, 2026

కేటీఆర్ ‘బాంబులేటి’ వ్యాఖ్యలపై ‘పొంగులేటి’ కౌంటర్

image

ఖమ్మం పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి పొంగులేటిని ఉద్దేశిస్తూ పదేపదే బాంబులేటి అంటూ వ్యాఖ్యానించారు. హన్మకొండలో మంత్రి ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ‘దీపావళి బాంబులు ఏం ఏం పేలుతున్నాయో వాళ్లకు తెలుసు.. వాళ్ల మనస్సాక్షికి తెలుసు.. వాళ్లు మాట్లాడే ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు’ అని పొంగులేటి అన్నారు.

News January 7, 2026

రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

AP: రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించింది. ఆ రోజు 6PM నుంచి 12AM లోపు స్పెషల్ షో వేసుకోవచ్చని తెలిపింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 (GSTతో కలిపి) పెంచుకోవచ్చని పేర్కొంది.