News March 6, 2025
సంగారెడ్డి: 31లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

మున్సిపాలిటీల్లో LRS క్రమబద్ధీకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.
Similar News
News March 15, 2025
పల్లార్‌గూడ: కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి

పల్లార్‌గూడ వీఆర్ఎన్ తండాలో విద్యుత్ షాక్ తగిలి గుగులోతు సురేష్ (28) మృతి చెందాడు. వ్యవసాయ బావి వద్ద పొలంలో కరెంటు ఫీజు సరి చేస్తుండగా కరెంటు ఉన్న వైరు తెగి మీద పడడంతో షాక్ తగిలి మృతి చెందినట్లు మృతుని భార్య రేణుక తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో సంగెం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 15, 2025
NLG: తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం!

జిల్లాలో ప్రజలు నిత్యం నిలువు దోపిడికి గురవుతున్నారు. కొన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు తూకాల్లోనే కాదు.. వివిధ రకాల మోసాలకూ పాల్పడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి రకరకాల తిరకాసులతో వినియోగదారులను నిండా ముంచుతున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో తూనికల కొలతల శాఖ అధికారులు 371 కేసులు నమోదు చేశారు. ఇందులో 96 కేసులు తప్పుడు తూకాలకు సంబంధించినవి కావడం గమనార్హం.
News March 15, 2025
కాకినాడ: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

ఓ తండ్రి కసాయిగా మారాడు. ఇద్దరు పిల్లల్ని క్రూరంగా చంపి తాను చనిపోయాడు. పిల్లలు చదవడం లేదని కాకినాడ రూరల్‌లో ఉంటున్న చంద్రకిషోర్ (37) హోలీ సంబరాలు కుటుంబంతో చేసుకున్నాడు. భార్యను వదిలేసి పిల్లలతో ఇంటికి వచ్చాడు. జోషిత(7), నిఖిల్ (6)ని తండ్రి ఇంటికి తీసుకొచ్చి బకెట్లో తలలు ముంచి దారుణంగా చంపేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల కోసం ఇంటికి వచ్చిన భార్య ఆ ఘటన చూసి నిర్ఘాంత పోయింది.