News January 27, 2025
సంగారెడ్డి: 31 వరకు గడువు పెంపు: డీఈవో

విద్యార్థుల గుర్తింపు కోసం తీసుకువచ్చిన అపార్ దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పేరును తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఎంఈవోలు ప్రత్యేక చొరవ తీసుకొని పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
కంచరపాలెంలో 7న జాబ్ మేళా

కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 7 కంపెనీలు పాల్గొనున్నాయి. టెన్త్,ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 18 నుంచి 33 సంవత్సరాలలోపు యువతీ, యువకులు అర్హులు. ఆసక్తి కలవారు https://www.ncs.gov.in, https://employment.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకొని నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలి.
News November 4, 2025
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకూడదు: కలెక్టర్

పత్తి విక్రయానికి వచ్చే రైతులను జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం, సీసీఐ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా, తేమ శాతం వంటి కారణాలతో వేధించవద్దని ఆయన ఆదేశించారు.
News November 4, 2025
భీమవరం: PCPNDT జిల్లా సలహా సంఘం సమావేశం

భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ జి. గీతాబాయి అధ్యక్షతన పీసీపీఎన్డీటీ జిల్లా సలహా సంఘం సమావేశం జరిగింది. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టం అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త స్కానింగ్ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన 4 దరఖాస్తులు, 2 పునరుద్ధరణ దరఖాస్తులు, 4 మార్పుల దరఖాస్తుల అనుమతులపై కూడా సలహా సంఘం చర్చించినట్లు ఆమె తెలిపారు.


