News March 11, 2025

సంగారెడ్డి: 31 వరకు చివరి అవకాశం: కలెక్టర్

image

పట్టణాలు, గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఈనెల 31వ తేదీ వరకు 25% రాయితీ ఉందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

Similar News

News November 19, 2025

ముత్యాలమ్మపాలెం: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు

image

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సూరాడ ముత్యాలు గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళుతుండగా అలల తాకిడికి పడవ బోల్తా పడింది. చింతకాయల పెంటయ్య, అర్జిల్లి బండియ్య గాయాలతోను మిగిలినవారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకార సంఘం రాష్ట్ర నాయకుడు చింతకాయల ముత్యాలు మెరైన్ పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు.

News November 19, 2025

మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

image

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.

News November 19, 2025

మర్రిపాడు: నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య

image

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ విద్యాలయానికి చేరుకొని విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.