News March 11, 2025

సంగారెడ్డి: 31 వరకు చివరి అవకాశం: కలెక్టర్

image

పట్టణాలు, గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఈనెల 31వ తేదీ వరకు 25% రాయితీ ఉందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

ఖమ్మం: డీవైఎస్ఓ సునీల్ రెడ్డికి అదనపు బాధ్యతలు

image

పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జ్ మేనేజర్ గా తుంబూరు సునీల్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ స్థానంలో ఉన్న శ్రీలత ఇటీవల హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. అయితే, ఆమె స్థానాన ఎవరినీ నియమించకపోవడంతో డీవైఎస్ఓగా ఉన్న సునీల్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యాన సజావుగా పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News April 17, 2026

మహిళా బిల్లు చదరంగం: ఎవరి ఎత్తులు వారివే!

image

మహిళా రిజర్వేషన్ల అమలుపై అధికార, ప్రతిపక్షాల వ్యూహాలు పతాక స్థాయికి చేరాయి. రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టాలని BJP ప్లాన్ వేసింది. బిల్లును అడ్డుకుంటే ‘మహిళా వ్యతిరేకులు’గా ముద్ర వేయొచ్చన్నది అధికార పక్షం ప్లాన్. దీనికి విపక్షాలు ‘కుల గణన’ అస్త్రంతో కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకున్నాయి. OBC కోటా లేని రిజర్వేషన్లు అసంపూర్ణమంటూ BJPకి కౌంటరిస్తున్నాయి.

News April 17, 2026

కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం!

image

పంచాయతీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జిల్లాలోని 385 పంచాయతీల్లో మొత్తం 12,58,456 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కాకినాడ రూరల్‌లో పెండింగ్‌లో ఉన్న 6 పంచాయతీలతో సహా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.