News February 5, 2025
సంగారెడ్డి: 675 చెరువుల మ్యాపులు సిద్ధం చేయండి: కలెక్టర్

హెచ్ఎండిఏ పరిధిలోని 675 చెరువుల మ్యాపులు సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.
Similar News
News January 21, 2026
పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా చొప్పదండి ప్రస్థానం

కరీంనగర్ జిల్లాలో 1951 నుంచే ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ఉన్న చొప్పదండి, తెలంగాణ రాష్ట్రంలో 2018 ఆగస్టు 2న మేజర్ పంచాయతీ నుంచి పురపాలికగా అవతరించింది. 14 వార్డులతో ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పట్టణ రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వ్యవసాయాధారిత గ్రామమైన చొప్పదండి, నేడు రాజకీయ, వాణిజ్య కేంద్రంగా విస్తరిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
News January 21, 2026
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం.. 10gలపై రూ.73వేలు లాభం!

ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీగా లాభాలొచ్చాయి. సరిగ్గా ఏడాది క్రితం రూ.81,230 ఉన్న 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు రూ.1,54,800కు చేరి రూ.73,570 లాభాన్ని పంచింది. అలాగే ఈ 3 రోజుల్లోనే రూ.11,020 పెరిగింది. అటు KG వెండి ధర రూ.1,04,000 నుంచి మూడు రెట్లు పెరిగి రూ.3,40,000కు చేరుకుంది. ఈ భారీ లాభాలతో పసిడి, వెండిపై ఇన్వెస్టర్లకు మరింత నమ్మకం ఏర్పడింది.
News January 21, 2026
విజయ్-రష్మిక పెళ్లికి డచ్ గులాబీలు!

విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. విజయ్-రష్మికకు విషెస్ చెబుతూ వారి పెళ్లికి తమ తరఫున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపనున్నట్లు చెప్పారు. ఈ ఫ్లవర్స్ వారి వేడుకను మరింత అందంగా మారుస్తాయని ఆకాంక్షించారు. ఇప్పటివరకు పెళ్లిపై రష్మిక, విజయ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.


