News February 8, 2025
సంగారెడ్డి: 9న ఎన్నికల విధులపై అధికారులకు శిక్షణ: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం తెలిపారు. ఈ శిక్షణకు విధులు కేటాయించిన అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.
Similar News
News February 23, 2026
తమిళనాడులో 74 లక్షల ఓట్లు రద్దు

SIRలో భాగంగా తమిళనాడులో 74 లక్షల అనర్హుల ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. దీంతో ఓటర్ల సంఖ్య 5.6కోట్లకు చేరింది. 2025 అక్టోబరు నాటికి TNలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా డిసెంబరుకు అది 5.43కోట్లకు తగ్గింది. ఇక DEC-JAN మధ్య 27.53లక్షల మంది అర్హులైన ఓటర్లను చేర్చినట్లు ఈసీ వెల్లడించింది. ఓవరాల్‌గా 74లక్షల ఓట్లు రద్దయ్యాయి. ఓట్లు రద్దైన వారు 15 రోజుల్లో జిల్లా మెజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
News February 23, 2026
పల్నాడు: పోలీస్ గ్రీవెన్స్‌కు 117 ఫిర్యాదులు

పల్నాడు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం PGRS నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏస్పీలు JV. సంతోష్ ,
M. లక్ష్మీపతి పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 117 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు పలు మోసాలు, బెదిరింపులపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. చట్ట ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.
News February 23, 2026
NGKL: ‘జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి’

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా, పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని TWJF జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, వెంకటస్వామి, పరమేశ్ కోరారు.


