News August 28, 2024

సంగారెడ్డి: ALERT.. కాన్ఫరెన్స్‌లో పెట్టి కాజేశారు

image

ఎల్‌ఐసీ పాలసీ పూర్తయినందున డబ్బులు అకౌంట్‌లో వేస్తామని న్యాల్కల్(M) బసంతపూర్‌‌కి చెందిన వెంకట్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్‌ చెప్పాలని కోరగా వెంటనే ఇచ్చాడు. అందులో డబ్బు లేదని, కనీసం రూ.3 వేలు ఉండాలని సైబర్‌ నేరగాడు చెప్పాడు. డబ్బులు వేస్తామని, వేరే వారి నంబర్ ఇవ్వాలని అడగ్గా అతడు సుదర్శన్‌రెడ్డికి కాన్ఫరెన్స్‌ కలిపాడు. అతడిని మాటల్లో పెట్టి ఖాతా నుంచి రూ.99 వేలు కొట్టేశాడు.

Similar News

News January 15, 2026

పీహెచ్‌సీలల్లో మందుల కొరత ఉండొద్దు: మెదక్ కలెక్టర్

image

పీహెచ్‌సీలల్లో అన్ని రకాల మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గది, రికార్డులు, హాజరు పట్టికని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని, అన్ని పరీక్షలు, మందులు నాణ్యతతో ఉచితంగా అందించాలని సూచించారు.

News January 15, 2026

యోగాసన పోటీల్లో మెదక్ క్రీడాకారుల ప్రతిభ

image

అస్మిత సౌత్ జోన్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాచారం డీపీఎస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా పాల్గొన్నారు. రిత్మిక్ పెయిర్ విభాగంలో సైనీ శిరీష, చిక్కుల మనోజ నాలుగో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. వారు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ అస్మిత యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు.

News January 15, 2026

మెదక్: రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో టెన్షన్!

image

మెదక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ వేడి రాజుకుంది. తమ స్థానం ఏ రిజర్వేషన్‌కు కేటాయిస్తారోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి పుర పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. రిజర్వేషన్ల లెక్కలను బట్టి అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.