News February 6, 2025

సంగారెడ్డి: ALERT.. 9న చివరి గడువు

image

బీసీ స్టడీ సర్కిల్‌లో ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.bcstudycircle.comలో ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి 100 రోజులపాటు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

HYD: తెలుగు వర్సిటీ..”SPTU-B” ఘన విజయం

image

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో సౌత్ జోన్ ఎంపికలలో భాగంగా నిర్వహించిన T20 మ్యాచ్‌లో ‘SPTU-A’ జట్టుపై ‘SPTU-B’ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన SPTU-B జట్టు 20 ఓవర్లలో 195/7 పరుగులు చేయగా.. వాసు 52 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. SPTU-A 17.2 ఓవర్లకే 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గెలుపొందిన జట్టుకు వీసీ, రిజిస్ట్రార్‌ అభినందనలు తెలిపారు.

News November 28, 2025

గజ్వేల్: సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా తూంకుంట

image

సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన నేత మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి. వర్గల్ మండల కేంద్రం సర్పంచ్‌గా మొదటగా నర్సారెడ్డి పనిచేశారు. అనంతరం వర్గల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఉమ్మడి మెదక్ డీసీసీబీ ఛైర్మన్‌గా పని చేసిన ఆయన 2009లో అసెంబ్లీ పునర్వ్యవస్థీకరణలో రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ గా మారడంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేశారు.

News November 28, 2025

MBNR: సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఫొటో, క్యాస్ట్, నోడ్యూస్, కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ జత చేయాలి. అఫిడవిట్ లో అభ్యర్థి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. డిపాజిట్ అమౌంట్ (SC, ST, BCలకు రూ.1,000, జనరల్ కు రూ.2,000) చెల్లించాలి. “Expenditure declaration” సమర్పించాలి. అవసరమైన వారికి #SHARE IT.