News February 6, 2025

సంగారెడ్డి: ALERT.. 9న చివరి గడువు

image

బీసీ స్టడీ సర్కిల్‌లో ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.bcstudycircle.comలో ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి 100 రోజులపాటు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2025

మెదక్: SSC పరీక్ష కేంద్రాల 163 BNSS సెక్షన్: SP

image

21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమి కూడొద్దని సూచించారు. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 20, 2025

సిద్దిపేట: గేట్ ఫలితాల్లో మెరిసిన యువకుడు

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రావణ్ రెడ్డి ఆల్ ఇండియాలో 807వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శ్రావణ్ రెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు. కాగా శ్రావణ్ రెడ్డి చిన్ననాటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

News March 20, 2025

జనగామలో ఒక్క రోజు దీక్షను జయప్రదం చేయాలని పిలుపు

image

జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ.. మార్చి 21న జనగామ చౌరస్తాలో నిర్వహించనున్న ఒక్క రోజు దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ.. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో బుధవారం పాలకుర్తి చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొడిశెట్టి వెంకన్న గౌడ్, తండ రమేశ్ గౌడ్, పులి గణేశ్ గౌడ్, పోశాల వెంకన్న గౌడ్, మూల వెంకటేశ్వర్లు, యాకయ్య గౌడ్ తదితరులున్నారు.

error: Content is protected !!