News January 27, 2025
సంగారెడ్డి: KCRను కలిసేందుకు పాదయాత్ర

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు తెలంగాణ తొలి సీఎం KCRను కలిసేందుకు సోమవారం ఝరాసంగం సంగమేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. 4 రోజుల పాటు సాగే పాదయాత్ర గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని KCR ఫామ్ హౌస్ వరకు సాగనుంది. పాదయాత్రను MLA మాణిక్ రావు, డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్ ప్రారంభించారు.
Similar News
News November 28, 2025
గజ్వేల్‌లో దారుణం.. అమానుష ఘటన

గజ్వేల్ పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగో బిడ్డను సాకలేనని ఓ తల్లి అబార్షన్ మాత్రలు మింగి గర్భస్రావం చేసుకుంది. గర్భస్రావం అనంతరం ఆరు నెలల నెత్తుటి గుడ్డును గజ్వేల్‌లోని రాజిరెడ్డిపల్లి పార్శి కుంట వద్ద పడేశారు. దీంతో స్థానికులు గమనించి నిలదీయడంతో నిజం ఒప్పుకున్నారు. వెంటనే గజ్వేల్ పోలీసులు తల్లి, ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీని అరెస్ట్ చేశారు.
News November 28, 2025
వరంగల్: ఉద్దండులంతా సర్పంచ్‌లే!

రాజకీయాలకు ఉమ్మడి WGL పెట్టింది పేరు. గ్రామ నుంచి ఢిల్లీ స్థాయివరకు ఎదిగిన నాయకులు ఎందరో ఉన్నారు. మాజీ మంత్రి DS రెడ్యానాయక్ 1981లో మరిపెడ(M) ఉగ్గంపల్లి సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ MP సురేందర్ రెడ్డి 1959లో మరిపెడ సర్పంచ్‌గా పనిచేశారు. BHPL MLA గండ్ర సత్యనారాయణ రావు 1984లో గణపురం(M) బుద్దారం సర్పంచ్‌గా, NSPT MLA మాధవరెడ్డి 1981లో చెన్నరావుపేట(M) అమీనాబాద్ సర్పంచ్‌గా చేశారు.
News November 28, 2025
సిరిసిల్ల: ఇంటర్వ్యూ కావాలని పిలిచి.. హతమార్చి..!

పీపుల్స్ వార్ పార్టీ మాజీ నక్సలైట్ బల్లెపు నరసయ్య అలియాస్ సిద్ధయ్య(బాపురెడ్డి) <<18408780>>హత్య<<>> ఘటనలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాను దళంలో ఉన్నప్పుడు చంపినవారి వివరాలను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో, బాధిత కుటుంబానికి చెందిన జక్కుల సంతోశ్ తనకు ఇంటర్వ్యూ కావాలని సిద్ధయ్యను అగ్రహారం గుట్టల వద్దకు రప్పించి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


