News December 30, 2024

సంగారెడ్డి: LOVE FAILURE.. యువతి సూసైడ్

image

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరభద్ర నగర్ చెందిన ఓ యువతి(22) ప్రేమ విఫలం కావడంతో ఒక ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 24, 2025

ఆందోల్: 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: మంత్రి దామోదర

image

ఆందోల్ మండలం నేరడిగుంటలో 10 రోజుల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నేరడిగుంట గ్రామసభలో 1994లో మహిళల అభివృద్ధి కోసం ఐదు రకాల భూమి కేటాయించామని, ఆ భూమిని ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని పేదలందరికీ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News January 22, 2025

ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ 6.9, అల్గోల్ 7.9, న్యాల్కల్ 8.7, అల్మాయిపేట 9.0, మల్చల్మ 9.6, కంకోల్, సత్వార్ 9.7, లక్ష్మీసాగర్ 9.8, దిగ్వాల్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ 10.0, కంది 10.2, కంగ్టి, మొగుడంపల్లి 10.3, పుల్కల్, ఝరాసంఘం 10.4, అన్నసాగర్ 10.5, బోడగాట్ 10.7, కల్హేర్ 10.8, దామరంచ, పోతారెడ్డిపేట, చౌటకూరు, సిర్గాపూర్ 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

News January 22, 2025

రైల్వే ట్రాక్‌పై సిద్దిపేట అమ్మాయి తల, మొండెం (UPDATE)

image

HYD జామై ఉస్మానియాలో<<15212796>>అమ్మాయి సూసైడ్<<>> కేసులో అసలు విషయం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే పోలీసుల వివరాలు.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఉస్మానియా మార్చురీలో బిడ్డను చూసిన పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు.