News April 2, 2025
సంగారెడ్డి: LRS 25% రాయితీ గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ప్లాట్ల లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం 25% రాయితీ గడువును ఈనెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ 25% రాయితీ గడువును ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 10, 2025
పూలే, అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

మహాత్మా జ్యోతిరావు పూలే, డా. B.R అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 11న పూలే, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో జిల్లా అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. గురువారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.
News April 10, 2025
‘మాస్ జాతర’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ‘మాస్ జాతర’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తోండగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీతో వింటేజ్ రవితేజను చూపిస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
News April 10, 2025
ఆ రైతులకు త్వరలోనే నష్టపరిహారం: మంత్రి తుమ్మల

TG: మార్చిలో కురిసిన వడగళ్ల వానకు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ నెల 3-9 వరకు రాష్ట్రంలో వర్షం, ఈదురుగాలుల బీభత్సానికి జరిగిన పంట నష్టంపై ప్రాథమిక నివేదిక అందిందని వెల్లడించారు.