News February 28, 2025
సంగారెడ్డి: MLC ఎన్నికలు.. 92.57 శాతం పోలింగ్

సంగారెడ్డి జిల్లాలో MLCఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీచర్స్ స్ఫూర్తిని చాటగా, పట్టభద్రులు ఫర్వాలేదనిపించారు. టీచర్స్ MLCకి 92.57 శాతం, పట్టభద్రులకు 73.19 శాతం నమోదైంది. జిల్లాలోని మొత్తం 67 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 74 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కాగా వాటిని కరీంనగర్లోని కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.
Similar News
News January 6, 2026
వరంగల్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

వరంగల్లో ఠాగూర్ సినిమా సీన్ రీపీట్ అయ్యింది. వరంగల్ రంగసాయిపేట చెందిన మోహన్ అనే వ్యక్తి శ్వాస సమస్యతో గత డిసెంబర్లో ఎంజీఎం ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజుల చికిత్స అనంతరం కుదుటపడిన మోహన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని కుటుంబ సభ్యులు గత నెల 27 నుంచి అడుగుతున్నా వైద్యులు డిశ్చార్జ్ చేయకుండా ఠాగూర్ సీన్ లాగా వైద్యం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.
News January 6, 2026
అతిగా దుస్తులు కొంటున్నారా?

‘ఫాస్ట్ ఫ్యాషన్’ పేరుతో మనం కొంటున్న దుస్తులు పర్యావరణానికి శాపంగా మారుతున్నాయి. ఏటా వెలువడుతున్న క్లాతింగ్ వేస్ట్ సముద్రాలను, నేలను విషతుల్యం చేస్తున్నాయి. మనం ధరించే ఒక్క జత బట్టల తయారీకి ఎన్నో లీటర్ల నీరు ఖర్చవుతుంది. అందుకే అవసరముంటేనే దుస్తులు కొనండి. ఉన్నవాటిని ఎక్కువ కాలం వాడండి. ఫ్యాషన్ కోసం ప్రకృతిని కలుషితం చేయకండి. బాధ్యతగా బట్టలు కొందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం. SHARE IT
News January 6, 2026
చివరి టెస్టు.. పట్టు బిగించిన ఆసీస్

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 384 పరుగులకు ఆలౌటవగా, ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 518/7 స్కోర్ చేసింది. దీంతో 134 పరుగుల లీడ్ సాధించింది. హెడ్ 163, స్టీవ్ స్మిత్ 129* అద్భుత సెంచరీలు చేశారు. కార్సే 3, స్టోక్స్ 2, జోష్, జాకోబ్ చెరో వికెట్ తీశారు. కాగా ఇప్పటికే 3-1 తేడాతో ఆసీస్ సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


