News March 2, 2025

సంగారెడ్డి: UDID పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కోసం UDID పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. UDID పోర్టల్‌లో వికలాంగులు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో ట్రైని కలెక్టర్ మనోజ్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, అదనపు డీఆర్డీవో జంగారెడ్డి పాల్గొన్నారు.

Similar News

News November 5, 2025

VKB: బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి స్పీకర్ సాయం

image

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ధన్నారం తండాకు(శ్రీరాంనగర్ తండా) చెందిన తారాబాయి కుటుంబానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల పరిహారంతో పాటు, తనవంతుగా రూ.1 లక్షను స్పీకర్ అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని స్పీకర్ అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

News November 5, 2025

మార్చి 31 నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పీఎం జన్మన్ కింద మార్చి 31వ తేదీ నాటికి లబ్ధిదారుల అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 556 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటివరకు 18 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. గ్రౌండింగ్‌లో ఉన్న 281 ఇళ్లు, ఇంకా ప్రారంభించని 257 ఇళ్లను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.

News November 5, 2025

MDK: ఆందోళనకు గురి చేస్తున్న ఆత్మహత్యలు

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఇటీవల యువకుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు యువకులు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి యువకులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.