News March 2, 2025
సంగారెడ్డి: UDID పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: కలెక్టర్

ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కోసం UDID పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. UDID పోర్టల్‌లో వికలాంగులు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో ట్రైని కలెక్టర్ మనోజ్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, అదనపు డీఆర్డీవో జంగారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News March 19, 2025
పార్వతీపురం: పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం నిర్వహించిన పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 10,367 మంది విద్యార్థులకు 10,319 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 38 పరీక్ష కేంద్రాల్లో శతశాతం హజరు నమోదైందని జిల్లా వ్యాప్తంగా 99.53 శాతం హాజరు నమోదుదైనట్లు తెలిపారు,
News March 19, 2025
ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలకు ఆహ్వానం : డీఈవో రాము

జగిత్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26కు తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రాము తెలిపారు. 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్వీకరణకు చివరి తేదీ ఈనెల 20. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఏప్రిల్ 21. పరీక్ష తేదీ 27.
News March 19, 2025
కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలోని రైతులకు బ్యాంకర్లు అధిక రుణ సౌకర్యం కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం బాపట్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రాధాన్యత రంగాలు, ప్రాధాన్యత లేని రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు నూరు శాతం చేరుకోవాలన్నారు. కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలన్నారు.