News March 22, 2024
సంగెం ఎంపీపీ పై అవిశ్వాస తీర్మాన పత్రం అందజేత

వరంగల్ జిల్లా సంగెం మండల ఎంపీపీ కందగట్ల కళావతి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మండలంలోని ఎంపీటీసీలు అందుకు సంభందించిన తీర్మాన పత్రాన్ని శుక్రవారం వరంగల్ ఆర్డీవో సీదం దత్తుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో వివిధ హోదాలలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికార దాహంతో పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకోవడంతోనే ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు తెలిపారు.
Similar News
News October 29, 2025
WGL: మొంథా తుఫాన్ ప్రభావం.. వర్షపాతం వివరాలు

మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఉదయం 8:30 గంటల నుండి 10:00 గంటల వరకు అత్యధిక వర్షపాతం రాయపర్తి మండలంలో 55.8 mm, వర్దన్నపేటలో 54.5mm నమోదైంది. పర్వతగిరి మండలంలో 42.8 mm, నెక్కొండలో 34.6 mm, ఖానాపూర్లో 34.0, చెన్నారావుపేటలో 19.5mm, సంగెంలో 12.3 mm, నర్సంపేటలో 9.0mm నమోదయ్యాయి.
News October 28, 2025
వరంగల్ మెట్ల బావిని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

కాకతీయుల వారసత్వానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక వరంగల్ మెట్ల బావిని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. స్థానిక ప్రజల సమక్షంలో ఆమె బావిని ప్రారంభించి నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. కాకతీయుల శిల్పకళను కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు. సొరంగ మార్గం ద్వారా రుద్రమదేవి ఈ బావికి వచ్చేదని ప్రతీతి అని గుర్తు చేశారు.
News October 27, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం మిర్చి బస్తాలు భారీగా తరలివచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16 వేలు, వండర్ హాట్ (WH) మిర్చి రూ.16,600 పలికింది. అలాగే తేజ మిర్చి ధర రూ.14,100, దీపిక మిర్చి రూ.15 వేలు పలికింది. మక్కలు(బిల్టీ)కి రూ.2050 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.


