News March 15, 2025
సంగెం: రోడ్డు ప్రమాదం.. మేస్త్రీ మృతి

సంగెం మండలం తిమ్మాపురం సబ్ <<15757117>>స్టేషన్ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. ప్రకాశం (D) జిగురుమల్లికి చెందిన బంగారు బాబు(34) కుటుంబంతో సంగెం(M)కి వలస వచ్చాడు. మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పని కోసం వెళ్తున్న బాబు, మణికంఠ బైక్‌ను బొలెరో ఢీకొట్టింది. చికిత్స కోసం 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో బాబు మృతిచెందాడు. కేసు నమోదైంది.
Similar News
News February 11, 2026
నల్గొండ: ఇవాళ సెలవు

నల్గొండతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల పరిధిలోని అన్ని బ్యాంకులకు బుధవారం సెలవు ప్రకటించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ తెలిపారు. గురువారం యథా విధిగా బ్యాంకులు పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఫిబ్రవరి 11న ప్రత్యేక సాధారణ సెలవు దినాన్ని వినియోగించుకుని తమ ఓటు వేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు.
News February 11, 2026
సిద్దిపేట: రేపు జిల్లా సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక: DYSO

సీఎం కప్ 2025 (2వ ఎడిషన్)లో భాగంగా జిల్లా సాఫ్ట్‌బాల్ పురుషుల, మహిళల జట్ల ఎంపికను ఈ నెల 13న నిర్వహించనున్నారు. సిద్దిపేట సెయింట్ పాల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ ఎంపికలు జరుగుతాయని డీవైఎస్ఓ (DYSO) వెంకట నర్సయ్య తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు తమ దరఖాస్తులతో హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News February 11, 2026
హరిత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ ఆర్డీఓ

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హరిత’ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఆర్డీఓ టి.సుమ బుధవారం సందర్శించారు. పర్యావరణ హితంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ కేంద్రాన్ని చూసి ఆమె ముగ్ధులయ్యారు. పోలింగ్ సరళిని అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం, హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ దగ్గర సహచర అధికారులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు.


