News October 25, 2024
సంచలనాల కోసం వార్తలు రాయకూడదు: ఎంపీ రఘునందన్ రావు

PIBHyderabad ఆధ్వర్యంలో నేడు మెదక్ పట్టణంలో వార్తలాప్- మీడియా వర్క్షాప్ జరిగింది. అతిథిగా మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు, ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. విలేకరులు ప్రజా సమస్యలను, వాస్తవాలను ఎత్తి చూపాల్సిందిగా ఎంపీ రఘునందన్ రావు జర్నలిస్టులను కోరారు. సంచలనాల కోసం వార్తలు రాయకూడదని జర్నలిస్టులకు తెలిపారు.
Similar News
News December 1, 2025
మెదక్: ప్రజావాణిలో 8 ఫిర్యాదులు

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు 8 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలు విని, వెంటనే చర్యలు తీసుకోవాలని సీఐలు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు పైరవీలు లేకుండా పోలీసులను సంప్రదించాలని, చట్టపరమైన న్యాయం అందించడం తమ బాధ్యతని ఎస్పీ తెలిపారు.
News December 1, 2025
మెదక్: నామినేషన్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసేందుకు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. మెదక్, శంకరంపేట్–ఆర్, రామాయంపేట్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ కేంద్రాల భద్రత, బందోబస్తు, పర్యవేక్షణ వ్యవస్థలను సమీక్షించారు. రద్దీ నియంత్రణ, శాంతిభద్రతలు కఠినంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. SP వెంట డీఎస్పీ నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
News December 1, 2025
MDK: అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరి: కలెక్టర్

స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలని, అన్ని లావాదేవీలు ఆ ఖాతా ద్వారా జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, పాత కుల సర్టిఫికెట్ కూడా చెల్లుబాటు అవుతుందని అన్నారు. సమస్యల కోసం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.


