News March 25, 2024

సంతనూతలపాడు: ఐదుగురు వాలంటీర్లు రాజీనామా

image

సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జునకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వాలంటీర్లు ఆదివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల కమిషన్ చెప్పడంతో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ రాజీనామాలను ఎంపీడీవోకు అందజేయకుండా నాగార్జునకు అందజేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.

Similar News

News September 29, 2024

బూచేపల్లి బాధ్యతల స్వీకరణకు.. డేట్ ఫిక్స్.!

image

ప్రకాశం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లాలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం తెలిపారు.

News September 29, 2024

పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే ధ్యేయం: ప్రకాశం ఎస్పీ

image

పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే తమ ధ్యేయమని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు అధికారులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లచే 474 మందికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స చేసి ఉచితంగా మందులు అందించారు.

News September 28, 2024

ప్రకాశం: అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ చేయండి: కలెక్టర్

image

వచ్చే నెల 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచే ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీపై డీఎల్‌డీఓలు, అన్ని మండలాల ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబరు 2వ తేదీ మహాత్మా గాంధీజీ జయంతి ప్రభుత్వ సెలవు దినము కావున 1వతేదీనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.