News March 25, 2024
సంతనూతలపాడు: ఐదుగురు వాలంటీర్లు రాజీనామా

సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జునకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వాలంటీర్లు ఆదివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల కమిషన్ చెప్పడంతో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ రాజీనామాలను ఎంపీడీవోకు అందజేయకుండా నాగార్జునకు అందజేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.
Similar News
News February 9, 2026
మార్కాపురం: లోయలో పడిన కారు.. ఒకరి మృతి

మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. CSపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వివరాల ప్రకారం.. కురిచేడు మండలానికి చెందిన విష్ణు భార్గవ్(25) గత నెల 17న తిరుమలనాథ స్వామి తిరుణాల నిమిత్తం కోనపల్లికి కారులో వెళ్లాడు. తిరిగి వస్తుండగా CSపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డు లోయలో కారు పడిపోయింది. ఇవాళ ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 9, 2026
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. 40లక్షల లడ్డూలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.
News February 8, 2026
మార్కాపురం: పలకల క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.


