News July 23, 2024
సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ దామోదర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను పరిశీలించారు. స్టేషన్లోని సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాల గురించి ఎస్పీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 23, 2025
ప్రకాశంలో వర్షం ఎఫెక్ట్.. రూ.2 కోట్లు మంజూరు చేసిన సీఎం

ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే జోరుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రైతాంగం నష్టాన్ని చూడాల్సి వచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, ఇతర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేశారు.
News October 23, 2025
ప్రకాశం జిల్లాలో ఆ స్కూళ్లకు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత మండలాలైన టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. అలాగే భారీ వర్షాల వలన వర్షపాతం నమోదైన పామూరు, CSపురం మండలాల్లో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా మండలాల్లో వాగులు వంకల నీటి ప్రవాహాన్ని బట్టి సెలవు ప్రకటించవచ్చని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 23, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి GOOD NEWS

రాష్ట్ర ప్రభుత్వం ‘ హౌసింగ్ ఫర్ ఆల్ ‘ పథకంలో భాగంగా పేదలకు సొంత ఇంటి స్థలం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నందున అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..GO ఎంఎస్ నెంబర్ -23 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయిస్తామని అన్నారు. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.