News February 1, 2025
సంతనూతలపాడు: మహిళలకు ఉచిత కంప్యూటర్ కోర్స్

సంతనూతలపాడు మండలం ఏండ్లూర్ వద్ద మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ కోర్స్ శిక్షణ తరగతులు ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జే.రవితేజ యాదవ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15 నుంచి 45 సంవత్సరాలు లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 6, 2025
మంత్రి స్వామికి 5వ ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప్రకాశం జిల్లా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి 5వ ర్యాంక్, బాపట్ల జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ ర్యాంక్ పొందారు. పనితీరును మెరుగు పరుచుకోవాని CM సూచించారు.
News February 6, 2025
ప్రకాశం: ఒకే రోజు ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లాలో బుధవారం వివిధ ఘటనలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం కంబలపాడు కి చెందిన సుబ్బరత్తమ్మ పొలంలో విద్యుత్ షాక్‌కి గురై మరణించారు. దర్శి మండలానికి చెందిన నారాయణమ్మ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించారు. అలాగే వరికుంటపాడు నుంచి పామూరు వస్తున్న బాలయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.
News February 6, 2025
ప్రకాశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం రాత్రి వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.