News January 7, 2025
సంతబొమ్మాళి: ఉరేసుకొని పోర్టు కార్మికుడి మృతి

సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలో సోమవారం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు వావిలపల్లి సురేశ్(25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మడకముడిగాం గ్రామానికి చెందిన యువకుడు పోర్టులో భోజనాలు అందించే వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మృతదేహాన్ని సంతబొమ్మాళి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సింహాచలం తెలిపారు.
Similar News
News February 11, 2026
టెక్కలి: జాబ్ మేళాలో 64 మందికి ఉద్యోగాలు

రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ అధ్యక్షతన టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 147 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 64 మంది అర్హతల ఆధారంగా పలు కంపెనీలకు ఎంపికయ్యారు. ప్లేస్మెంట్ అధికారి M.వంశీ క్రిష్ణ, IQAC కోఆర్డినేటర్ ల్యూక్ పాల్, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.
News February 11, 2026
SKLM: శైవ క్షేత్రాలకు RTC స్పెషల్ బస్సులు

15న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం APSRTC రీజియన్ పరిధిలో అన్ని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ బుధవారం తెలిపారు. PSA డిపో నుంచి సాబకోటకు 10, TKL డిపో నుంచి రావివలసకు 5, SKLM-2 డిపో నుంచి రామతీర్థం 15 బస్సులు, 18న జరగనున్న శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానమహోత్సవానికి 2వ డిపో నుంచి 10, TKL 5 నుంచి బస్సులు నడుపుతామన్నారు.
News February 11, 2026
శ్రీకాకుళం: టెన్త్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

తపాలా శాఖలో బీపీఎం, ఏబీపీఎం, గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 80 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16లోగా indiapost.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000 – రూ.29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470


