News September 5, 2024

సంతబొమ్మాళి: 104 వాహనంలో నాగుపాము హల్ చల్

image

సంతబొమ్మాలి మండలం మేఘవరం సమీపంలో బంజీరు తోట వద్ద గురువారం 104 వాహనం ద్వారా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అయితే 104 వాహనంలో నాగుపాము ఒక్కసారిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. అది కాస్త ఇంజిన్ లోకి వెళ్లి ఇరుక్కుపోవడంతో దాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తూ..శిబిరాన్ని నిలిపివేసినట్లు సిబ్బంది తెలిపారు.

Similar News

News September 14, 2024

SKLM: రిమ్స్‌లో నవజాత శిశువు మృతి

image

నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద మతిస్థిమితం లేని మహిళ అప్పాజీ ఈనెల 8వ తేదీన రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నెలల వయస్సు, బరువు తక్కువగా ఉన్న శిశువును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.

News September 14, 2024

శ్రీకాకుళం: అధ్వానంగా రోడ్డు

image

శ్రీకాకుళం వెళ్లే మార్గమధ్యలో రాగోలు వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు మొత్తం బుదరమయంగా మారింది. భారీ వాహనాలు కొన్ని బుదరలో కూరుకుపోయాయి. ఈ మార్గలో రాకపోకలు సాగించే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీ ఏరియాలోనూ రోడ్లు ఇలాగే ఉన్నాయా? ఉంటే ఎక్కడో కామెంట్ చేయండి.

News September 13, 2024

ఇచ్చాపురం: కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి

image

సిక్కోలు జిల్లాలో కిడ్నీ రోగానికి మరొకరు బలయ్యారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం ఆశి వీధికి చెందిన దల్లి గురుమూర్తి(39) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం చనిపోయారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు గీతా, శ్రావణి, కుమారుడు తేజ ఉన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.