News July 28, 2024
సంతమాగులూరు: అనుమానాస్పద రీతిలో ఒకరు మృతి

సంతమాగులూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వంట మనిషిగా చేస్తున్న మొగులమ్మ, శావల్యాపురానికి చెందిన శ్రీనివాసరావు సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి మొగులమ్మ ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు తెల్లవారిజామున చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News November 24, 2025
రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్కి గురై..

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
News November 24, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్ఛార్జ్గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.