News May 24, 2024
సంతమాగులూరు: చికిత్స పొందుతూ మహిళ మృతి

మండలంలోని ఏల్చూరులో బాల ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద గురువారం చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన అంకంశెట్టి పున్నాయమ్మ దీపారాధన చేస్తూ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు నరసరావుపేట వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News January 6, 2026
మార్కాపురం జిల్లాకు 59 మంది ఇన్ఛార్జ్ అధికారులు

మార్కాపురం నూతన జిల్లా ఏర్పడిన రోజు ఇన్ఛార్జ్ కలెక్టర్గా రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జిల్లాకు ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన 59 మంది ఇన్ఛార్జ్ జిల్లా అధికారులను నియమించారు.
News January 6, 2026
ప్రకాశం, మార్కాపురం జిల్లాలు.. అసలు రూపం ఇదే!

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని అధికారులు రూపొందించారు. ప్రకాశం జిల్లా 28 మండలాలు, 520 గ్రామాలతో ఉండగా.. మార్కాపురం జిల్లా 21 మండలాలతో 508 గ్రామాలతో స్వరూపాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక విస్తీర్ణం విషయంలో ప్రకాశం జిల్లా 15,58,828.77 ఎకరాలు, మార్కాపురం 14,82,757.24 ఎకరాలు ఉంది.
News January 5, 2026
కనిగిరి: మహిళను హత్య చేసి.. ప్రియుడి సూసైడ్

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


