News March 10, 2025
సంతమాగులూరు: మృతి చెందిన వ్యక్తి వివరాలు గుర్తింపు

సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని బరంపేటకు చెందిన శివారెడ్డిగా గుర్తించారు. అలాగే పంచనామా అనంతరం శివారెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Similar News
News November 20, 2025
ఇండియాకు 100 US జావెలిన్ మిస్సైళ్లు

దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. $92.8M విలువైన 100 FGM-148 జావెలిన్ క్షిపణులను, ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ అమ్మకానికి US ఆమోదం తెలిపింది. ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేలా భారత రక్షణ రంగం పటిష్ఠం అవుతుందని US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వివరించింది. మిస్సైల్స్‌తో పాటు లాంచర్ యూనిట్లు, ఫిరంగి గుండ్లు అందుతాయి. మిస్సైల్‌ను భుజంపై మోస్తూ ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు.
News November 20, 2025
నిజామాబాద్: దారుణం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

నిజామాబాద్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రే సొంత కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇటీవల అర్ధరాత్రి కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
News November 20, 2025
ఎక్స్ట్రీమ్ వెదర్‌తో 4,064 మంది మృతి

దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది JAN-SEP వరకు 4,064 మంది మృత్యువాత పడినట్లు ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ & ‘డౌన్ టు ఎర్త్’ నివేదిక వెల్లడించింది. గత 4 ఏళ్లతో పోలిస్తే మరణాలు 48% పెరిగినట్లు పేర్కొంది. 9.47 M హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. వ్యవసాయ రాష్ట్రాలైన AP, WBల సమాచారం అసమగ్రంగా ఉందని, నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చంది.


