News March 10, 2025
సంతమాగులూరు: మృతి చెందిన వ్యక్తి వివరాలు గుర్తింపు

సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని బరంపేటకు చెందిన శివారెడ్డిగా గుర్తించారు. అలాగే పంచనామా అనంతరం శివారెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Similar News
News March 13, 2026
పల్నాడు: గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక నంబర్

పల్నాడు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సంజన సింహ గురువారం తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ (08647-252999) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
News March 13, 2026
వారు రక్తదానం చేయడంపై నిషేధం కొనసాగుతుంది: కేంద్రం

ట్రాన్స్‌జెండర్లు, పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషులు, సెక్స్ వర్కర్ల రక్తదానంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. HIV, హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిబంధనలు అవసరమని తెలిపింది. ఇది వివక్ష కాదని స్పష్టం చేసింది. కేవలం లైంగిక గుర్తింపు ఆధారంగా రక్తదానాన్ని నిరాకరించడం చట్టవిరుద్ధమని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కేంద్రం వివరణ ఇచ్చింది.
News March 13, 2026
VJA: బాలికతో అసభ్య ప్రవర్తన.. ప్రిన్సిపల్‌కు రిమాండ్

విజయవాడ భవానిపురానికి చెందిన ఓ బాలికతో స్కూల్ ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రిన్సిపల్ సాంబశివరావు(65)ను భవానిపురం పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట గురువారం హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు భవానిపురం సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.


