News January 11, 2025
సంతమాగులూరు: సంక్రాంతికి ఊరు వస్తూ వ్యక్తి మృతి

సంతమాగులూరు మండలంలోని పుట్ట వారి పాలెం వద్ద శనివారం కారు ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందినట్లుగా సంతమాగులూరు పోలీసులు చెప్పారు. కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో అతన్ని నరసరావుపేటలో ప్రవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా చెప్పారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామైన రావినూతల వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.
Similar News
News October 23, 2025
ప్రకాశం జిల్లాలో ఆ స్కూళ్లకు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత మండలాలైన టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. అలాగే భారీ వర్షాల వలన వర్షపాతం నమోదైన పామూరు, CSపురం మండలాల్లో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా మండలాల్లో వాగులు వంకల నీటి ప్రవాహాన్ని బట్టి సెలవు ప్రకటించవచ్చని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 23, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి GOOD NEWS

రాష్ట్ర ప్రభుత్వం ‘ హౌసింగ్ ఫర్ ఆల్ ‘ పథకంలో భాగంగా పేదలకు సొంత ఇంటి స్థలం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నందున అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..GO ఎంఎస్ నెంబర్ -23 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయిస్తామని అన్నారు. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 23, 2025
వర్షం ఎఫెక్ట్.. ప్రకాశం జిల్లాకు NDRF బృందాలు

ప్రకాశం జిల్లాకు మరో రెండు రోజులపాటు భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగానికి హోంమంత్రి అనిత బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు NDRF బృందాలను పంపించేలా ఆమె ఆదేశించారు. దీంతో ప్రకాశం జిల్లాపై ఎలాంటి తుఫాన్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు, కలెక్టర్ రాజాబాబు సారథ్యంలో సిద్ధమయ్యారు.