News February 13, 2025
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి సెలవు ప్రకటించాలి

లంబాడాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని, లంబాడీల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు డా.రాజ్ కుమార్ జాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోత్ ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కమాండ్ కంట్రోల్ ప్రాంగణంలో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేసింది. సెలవు ప్రకటించేలా కృషి చేస్తానని చెప్పారు.
Similar News
News November 23, 2025
ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.

వాహనదారులకు అలర్ట్.. ఓవర్లోడ్తో పట్టుబడితే..

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆకస్మిక తనిఖీల కోసం 33 జిల్లా, 3 రాష్ట్ర స్థాయి స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. గత 10రోజుల్లో 4,748 కేసులు నమోదవగా, 3,420 వాహనాలు సీజ్ చేశారు. ఓవర్లోడ్తో వెళ్తూ తొలిసారి పట్టుబడితే వెహికల్ సీజ్ చేస్తారు. రెండో సారి పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇకపై లైసెన్స్ రెన్యువల్ టైంలో భారీ వాహనాల డ్రైవర్లకు రీఫ్రెషర్ ట్రైనింగ్ ఉంటుంది.