News February 13, 2025
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి సెలవు ప్రకటించాలి

లంబాడాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని, లంబాడీల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు డా.రాజ్ కుమార్ జాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోత్ ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కమాండ్ కంట్రోల్ ప్రాంగణంలో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేసింది. సెలవు ప్రకటించేలా కృషి చేస్తానని చెప్పారు.
Similar News
News March 19, 2025
ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News March 19, 2025
నంద్యాల: ఇద్దరు అధికారులు సస్పెండ్ సస్పెండ్.. విధుల్లో చేరేందుకు పైరవీ..?

శ్రీశైలం ప్రాజెక్టు జలవనరుల శాఖకు చెందిన ఇద్దరు EEలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇద్దరు అధికారులను గతేడాది సెప్టెంబరులో శ్రీశైలానికి బదిలీ చేసింది. అయితే వారు ఇప్పటికీ విధుల్లో చేరలేదు. దీంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్.. తాజాగా వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వారు విధుల్లో చేరేందుకు కార్యాలయం వద్ద పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
News March 19, 2025
మెదక్ జిల్లాలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు

చిన్నశంకరంపేట మండలం మడూరు శివాలయం వద్ద అద్భుతంగా చెక్కిన రాష్ట్రకూట, కళ్యాణిచాళుక్య, కాకతీయ శైలుల శిల్పాలు లభించాయని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. కళ్యాణి చాళుక్య శైలిలో ఆభరణాలతో చెక్కిన యోగశయనమూర్తి విగ్రహం యోగముద్రలో శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శిల్పం ద్వారపాలకులు, అష్టభుజ మహిషాసురమర్ధిని, సరస్వతీ దేవి విగ్రహం, చతుర్భుజ విష్ణు విగ్రహాలు ఉన్నాయన్నారు.