News January 20, 2025
సందర్శకులతో కిక్కిరిసిన నాంపల్లి నుమాయిష్

నాంపల్లి ఎగ్జిబిషన్ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసింది. ఒక్కరోజే 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడించారు. వివిధ స్టాళ్ల వద్ద తమకు నచ్చినవి కొనుగోలు చేస్తూ పిల్లలతో సరదాగా గడిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఆసక్తి కనబరిచారు.
Similar News
News October 23, 2025
HYD: రేపు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు విడుదల: KTR

కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రూపొందించింది. శుక్రవారం కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి HYDలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని నిరుద్యోగ జేఏసీ ఈరోజు ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలువురు నిరుద్యోగులు నామినేషన్లు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.
News October 23, 2025
HYD: ప్రజాపాలన వైపే ప్రజలు: మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలన వైపే ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ పరిధి బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్లో ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. BRS నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి నవీన్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.
News October 23, 2025
BIG BREAKING: బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. అరెస్ట్

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (వెస్ట్ జోన్), బంజారాహిల్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో నిర్వాహకుడు, సెలూన్ వ్యాపారి మహమ్మద్ షరీఫ్, కర్నూలుకు చెందిన ఏడుగురు కస్టమర్లు, హోటల్ రిసెప్షనిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.