News April 3, 2025
సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్: నిర్మల్ కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకంపై సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తు గడువును పెంచారని ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News November 3, 2025
435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.
News November 3, 2025
టిప్పర్ డ్రైవర్ గుర్తింపు

TG: రంగారెడ్డి జిల్లాలో <<18184089>>బస్సు ప్రమాదానికి<<>> కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆకాశ్ కూడా చనిపోయాడు.
News November 3, 2025
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ASF ఎస్సీ

బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.


