News December 14, 2024
సంధ్య థియేటర్ తరఫున వాదించిన న్యాయవాది మన మెట్ పల్లి వాసినే..

పుష్ప-2 ఘటన లో సంధ్య థియేటర్ & అల్లు అర్జున్ పై BNS 105, 118 (1) r/w 3/5 సెక్షన్ల కింద కేసు నమోదై అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టు లో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున ఆయన వాదించారు.
Similar News
News July 11, 2025
కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.
News July 11, 2025
కరీంనగర్: PET పోస్టుకు దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

కరీంనగర్ జిల్లా KGBVలోని ఖాళీ పీఈటీ పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య గురువారం తెలిపారు. 2023లో అర్హత పొందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. వారిని ఫోన్ లేదా మెసేజ్ ద్వారా పిలుస్తామని, వివరాలను www.karimnagardeo.com వెబ్‌సైట్‌లో పెడతామని, సంబంధిత అభ్యర్థులు తగు సర్టిఫికేట్లు, 3 ఫొటోలతో ఈనెల 11న జిల్లా విద్యా శాఖ ఆఫీస్‌లో హజరుకావాలన్నారు.
News July 10, 2025
జమ్మికుంట: గంజాయి విక్రయం.. నలుగురి అరెస్టు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎఫ్‌సీఐ సమీపంలో నిషేధిత గంజాయి అమ్మేందుకు వచ్చిన నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు యువకులను పట్టుకుని విచారించి వివరాలు సేకరించినట్లు చెప్పారు.