News February 6, 2025
సంపన్నులకు దోచిపెట్టేలా కేంద్ర బడ్జెట్: ఏఐటీయూసీ, సీఐటీయూ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738819380144_52057910-normal-WIFI.webp)
సంపన్నులకు దోచిపెట్టేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని వరంగల్ జిల్లా ఏఐటీయూసీ, సీఐటీయూ కార్యదర్శులు ముక్కెర రామస్వామి, గన్నారం రమేష్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తాలో నిరసన చేపట్టి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. బడ్జెట్ కార్మికులు, కర్షకులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు.
Similar News
News February 6, 2025
భీమారం: తాళం వేసిన ఇంట్లో చోరీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738844074947_50641803-normal-WIFI.webp)
భీమారంలోని ఐటీడీఏ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. భీమారం ఎస్ఐ శ్వేత వివరాల ప్రకారం.. రాంటెంకి రంజిత్ కుమార్ జనవరి 31న తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్దిపేట మండలంలోని శనిగారం గ్రామానికి వెళ్లాడు. కాగా ఈనెల 5న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో రూ.50వేల నగదు, రూ.42వేల విలువ గల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News February 6, 2025
అందరి ముందు బట్టలు విప్పేసిన భార్యను సమర్థించిన భర్త
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738845088440_746-normal-WIFI.webp)
గ్రామీ అవార్డుల వేడుకలో అమెరికా స్టార్ సింగర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా సెన్సారి <<15346210>>నగ్నంగా<<>> కెమెరాలకు పోజులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తన భార్య చేసిన ఘనకార్యాన్ని కాన్యే సమర్థించారు. తన భార్య స్మార్ట్, టాలెంటెడ్, బ్రేవ్ అని వెనకేసుకొచ్చారు. తమపై విమర్శలొచ్చినప్పటికీ ఆరోజు అత్యధికంగా గూగుల్‌లో శోధించిన వ్యక్తిగా సెన్సారి నిలిచిందన్నారు. ఇది గ్రామీ అవార్డులను సైతం ఓడించిందని భార్యను కొనియాడారు.
News February 6, 2025
సిద్దిపేట: కుంభమేళకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738850515598_1243-normal-WIFI.webp)
ఉత్తరప్రదేశ్‌లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం డిలాయ్ (కూచారం) కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. డిలాయ్ మెరుగు రవీందర్ యాదవ్ (45), గజ్వేల్ మండలం ఆరేపల్లికి చెందిన బామ్మర్ది భిక్షపతి కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్య వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. రవీందర్ మృతిచెందగా, కొడుకు క్రువిత్, బామ్మర్ది తిరుపతి గాయపడ్డారు.