News October 22, 2024
సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మారుద్దాం: చిత్తూరు కలెక్టర్
చిత్తూరును సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చుదామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్‌హెచ్‌జీ సంఘ సభ్యులు, భోజన నిర్వాహకులు, ఆయాలు, హెల్పర్లు, వాచ్మెన్ తదితరులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.
Similar News
News November 3, 2024
రోడ్డు ప్రమాదంలో వరదయ్యపాళెం యువకుడు మృతి
వరదయ్యపాళెం మండలంలోని గోవర్ధనపురం గ్రామానికి చెందిన సుదేవ్ (22) అతని స్నేహితులు మూడు రోజుల క్రితం నాయుడుపేటకి వెళ్లారు. తిరిగి వస్తుండగా నాయుడుపేట బైపాస్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సుదేవ్‌కి తీవ్ర గాయాలతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఘటనపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 3, 2024
3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషం: మంత్రి నాదెండ్ల
దీపం – 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ..పేదల సమస్యలు అర్థం చేసుకున్న మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, DY.CM పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయాలని నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
News November 2, 2024
తిరుపతి: హోంమంత్రి రెండు రోజుల పర్యటన వివరాలు
హోం మంత్రి తిరుపతి జిల్లాలో 2 రోజులు పర్యటించనున్నారు. 3న మధ్యాహ్నం 12.05 కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొనున్నారు. 12.35 నుంచి 1.30 గంటల వరకు అలివేలు మంగాపురం గ్రామంలో పర్యటించనున్నారు. 3.10 గంటలకు పద్మావతి మహిళా యూనివర్సిటీలో అనంతపురం డీఐజీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. 11 కు అలిపిరి కపిల తీర్థం ఆలయం దర్శించనున్నారు.