News April 28, 2024
సంపూర్ణ అక్షరాస్యత.. నవభారత్ సాక్షరత
సంపూర్ణ అక్షరాస్యతలో భాగంగా 15 ఏళ్లు దాటిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ‘నవభారత్ సాక్షరత’ (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను వినియోగించుకోనున్నారు. గ్రామ పరిధిలోని నిరక్షరాస్యులైన వయోజనులను గుర్తించి అక్షరాలను నేర్పిస్తారు.
Similar News
News January 3, 2025
నేడు సంగారెడ్డిలో మంత్రి పర్యటన
సంగారెడ్డిలో నేడు మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో అమృత్ 2.0 కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, సమాఖ్య పెట్రోల్ పంపుకు శంకుస్థాపన, మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేసి 108 అంబులెన్స్లను ప్రారంభిస్తారు. జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించున్నారు.
News January 3, 2025
SRD: ఈ నెల 22 వరకు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించండి
ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివే అభ్యర్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పదవ తరగతి ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, ఇంటర్మీడియట్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని పేర్కొన్నారు. రూ.25 అపరాధ రుసుంతో ఈనెల 29 వరకు, రూ. 50 అపరాద రుసుంతో ఫిబ్రవరి 5వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.
News January 2, 2025
రేపు పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం: DEO
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా రేపు అన్ని పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.