News January 28, 2025

సంప్రదాయ వస్త్రధారణ లేకుండా స్వామి వారి దర్శనం

image

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనానికి తప్పకుండా సంప్రదాయ వస్త్రధారణ ఉండాలనేది టీటీడీ నిబంధన. దర్శన టోకెన్ల తనిఖీ నుంచి ఆలయంలోకి ప్రవేశించే వరకు వివిధ ప్రాంతాల్లో సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని అనుమతిస్తారు. అలాంటిది సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఓ మహిళ సంప్రదాయ దుస్తులు లేకుండా స్వామి వారి దర్శనం చేసుకోవడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Similar News

News November 18, 2025

రేపు పుట్టపర్తికి వస్తున్నా: PM మోదీ

image

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను రేపు పుట్టపర్తికి వస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత కోసం బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో బాబాతో తనకు అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం లభించిందని, ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

News November 18, 2025

కామారెడ్డి: ఇళ్ల లక్ష్యాలు పకడ్బందీగా సాధించాలి: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపీడీవోలతో జరిగిన ఈ సమావేశంలో.. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుని, పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు.

News November 18, 2025

సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.